క్రైమ్ మిర్రర్, సినిమా:- టాలీవుడ్ ప్రేక్షకులకు నిరాశ కలిగించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.ఈ సినిమా ప్రారంభమైన సమయంలోనే మేకర్స్ సెప్టెంబర్ 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇటీవల ఈ జంట వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలు, ఇతర కార్యక్రమాల కారణంగా సినిమా షూటింగ్‌కు కొన్ని రోజులు అనివార్యంగా బ్రేక్ పడింది.షూటింగ్ వాయిదా పడటంతో, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 11 నాటికి సినిమా పూర్తి కావడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారట. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండాలంటే మరింత సమయం పడుతుందని, కాబట్టి అనుకున్న సమయానికి సినిమా సిద్ధం కాదనే ఉద్దేశ్యంతోనే చిత్ర బృందం ఈ వాయిదా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.దీంతో త్వరలోనే ఒక కొత్త రిలీజ్ డేట్‌ను ఖరారు చేసి, అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న టాక్. ఈ వార్తతో అటు విజయ్, ఇటు రష్మిక అభిమానులు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సిమ్ కార్డు మూల కట్ చేసి ఉండటానికి అసలు కారణం ఏంటో తెలుసా?
కావాలని నోబాల్ వేస్తే సస్పెండ్.. డొమెస్టిక్ క్రికెట్‌లో BCCI కీలక మార్పులు!