Homeక్రైమ్"నాకు ప్రాణహానీ ఉంది"- పోలీసులను ఆశ్రయించిన కుంభమేళా ఫేమ్ మోనాలిసా

“నాకు ప్రాణహానీ ఉంది”- పోలీసులను ఆశ్రయించిన కుంభమేళా ఫేమ్ మోనాలిసా

కుంభమేళా సందర్భంగా గుర్తింపు పొందిన మోనాలిసా మరోసారి వార్తల్లోకి వచ్చారు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. భద్రత కల్పించాలని కోరుతూ ఆమె అధికారికంగా ఫిర్యాదు చేసింది.

ఆదివారం రోజున తన న్యాయవాదితో కలిసి కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మోనాలిసా, రక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ సందర్భంగా ఆమె చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. తన తండ్రి తన పాస్‌పోర్ట్, డబ్బును తీసుకున్నారని, తనకు ప్రాణహాని ఉందని మోనాలిసా వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదును స్వీకరించి, విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం పై స్థానికంగా చర్చలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు కేసును పరిశీలిస్తూ తదుపరి చర్యలపై దృష్టి సారించారు.

also read: “ఇది నా జీవితంలో కఠిన సమయం”- అమితాబ్ బచ్చన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు