Homeవైరల్కదిలే రైల్లో షాకింగ్ ఘటన.. దొంగను తన్నేసిన ప్రయాణికుడు!

కదిలే రైల్లో షాకింగ్ ఘటన.. దొంగను తన్నేసిన ప్రయాణికుడు!

ఛత్తీస్‌గఢ్‌లో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి పర్సు దొంగిలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని, ఆ ప్రయాణికుడు కదిలే రైలు తలుపు దగ్గర నుంచి కిందకు తోసేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

లభించిన సమాచారం ప్రకారం, కె.ఆర్. సురేష్ కుమార్ అనే ప్రయాణికుడు తన పర్సు కొట్టేసినట్లు గుర్తించి, వెంటనే స్పందించాడు. దొంగను పట్టుకుని రైలు తలుపు వద్దకు తీసుకెళ్లి కాలితో తన్నడంతో, అతడు కిందపడిపోయినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, రాయ్‌పూర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు నుంచి పడిపోయిన వ్యక్తి గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రయాణికుడి ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.

also read: బుల్లితెర నటి జెన్నిఫర్ వింగెట్ కొత్త జీవితానికి శ్రీకారం… రెండో పెళ్లిపై అధికారిక ప్రకటన!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు