బుల్లితెరలో తన అందం, నటనతో అభిమానులను ఆకట్టుకున్న ప్రముఖ నటి జెన్నిఫర్ వింగెట్ తాజాగా తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అడుగు వేసింది. 41 ఏళ్ల వయసులో ఆమె రెండో వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త విలియమ్ ఇస్మాయిల్ ను యూకేలోని ఓ చర్చిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు వీడియో రూపంలో పంచుకుంది. ఈ వీడియో బయటకు రావడంతో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న పెళ్లి వార్తలకు స్పష్టత వచ్చింది.
జెన్నిఫర్ వింగెట్ గతంలో ప్రముఖ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను 2012లో వివాహం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట 2014లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్న జెన్నిఫర్ ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఆనందపరుస్తోంది.
సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియోకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. “నూతన జీవితం సంతోషంగా సాగాలి” అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే తన కెరీర్‌లో పలు విజయవంతమైన సీరియల్స్‌తో గుర్తింపు పొందిన జెన్నిఫర్, వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషాన్ని ఆస్వాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
also read: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ముగింపు.. జానీ మాస్టర్‌పై నిషేధం ఎత్తివేత