HomeసినిమాRamayana: ఇది సినిమా కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయాణం..!

Ramayana: ఇది సినిమా కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయాణం..!

క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రామాయణం పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప ప్రయాణమని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన రామాయణం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న రకుల్ తన అనుభూతులను అభిమానులతో పంచుకున్నారు.ఈ చిత్రం ప్రేక్షకులను ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుందని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఇలాంటి భారీ స్థాయి చిత్రంలో భాగం కావడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని, ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో ప్రత్యేకమైన విషయమని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Prashanth Neel: ప్రశాంత్ నీల్ హారర్ మూవీ 418 రిలీజ్ డేట్ ఫిక్స్..!

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో కనిపించనున్నారు. రావణాసురుడి సోదరిగా కథలో కీలకమైన పాత్రను ఆమె పోషించనుండగా, ఇప్పటికే ఈ పాత్రపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం 2026 దీపావళి, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ రూమర్స్.. ఇక నా జీవితం నాదే అంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు