HomeUncategorizedPrashanth Neel: ప్రశాంత్ నీల్ హారర్ మూవీ 418 రిలీజ్ డేట్ ఫిక్స్..!

Prashanth Neel: ప్రశాంత్ నీల్ హారర్ మూవీ 418 రిలీజ్ డేట్ ఫిక్స్..!

క్రైమ్ మిర్రర్, సినిమా :- కమర్షియల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తొలిసారిగా హారర్ జానర్‌లో అడుగుపెడుతోంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కుతున్న కొత్త తెలుగు హారర్ చిత్రం 418 విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూలై 31న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. విడుదల ప్రకటనతో పాటు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
418 చిత్రంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్ పర్సనాలిటీగా గుర్తింపు పొందిన ప్రీతి పగడాల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమెతో పాటు చరణ్ లక్కరాజు, సూర్య రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పతంగ్ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రీతి, ఈ హారర్ థ్రిల్లర్‌తో మరోసారి తన నటనను చూపించనున్నారు.

అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ రూమర్స్.. ఇక నా జీవితం నాదే అంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఈ చిత్రానికి కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ యాక్షన్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను సమర్పిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా తొలిసారిగా హారర్ జానర్‌లోకి అడుగుపెడుతుండటంతో సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.రిలీజ్ పోస్టర్‌లో ముంగురులు తిరిగిన పొడవాటి జుట్టుతో వెనక్కి తిరిగి కూర్చున్న ఓ యువతి బ్యాక్ లుక్‌ను చూపించడం ద్వారా మేకర్స్ కథపై సస్పెన్స్‌ను పెంచారు. పోస్టర్‌లోని డార్క్ విజువల్స్, మిస్టరీ ఎలిమెంట్స్ సినిమా హారర్ నేపథ్యాన్ని సూచిస్తున్నాయి.ఈ చిత్రానికి దినేశ్ దినకరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వెంకీ జీజీ సంగీతం సమకూరుస్తున్నారు. సాంకేతికంగా కూడా సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న 418 తెలుగు హారర్ సినిమాల్లో కొత్త అనుభూతిని అందిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో సంబంధం లేదు…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు