Homeఆంధ్ర ప్రదేశ్వ‌రుణుడు క‌రుణించేనా...! ఏపీలో 35శాతం లోటు వ‌ర్ష‌పాతం...!

వ‌రుణుడు క‌రుణించేనా…! ఏపీలో 35శాతం లోటు వ‌ర్ష‌పాతం…!

విజయవాడ, క్రైమ్‌మిర్ర‌ర్‌: వరుణుడు దోబూచులాడుతున్నాడు. అప్పుడప్పుడూ వర్షాలు కురుస్తున్నా కూడా సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఏపీలో జూలై నెలలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఐదు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలలో లోటు వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. మరోవైపు ఎల్ నినో కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో తక్కువ వర్షపాతం నమోదౌతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుణుడు దోబూచులాడుతున్నాడు. దీంతో ఏపీలో లోటు వర్షపాతం 35 శాతానికి పెరిగింది. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాలలో దాదాపు 20 జిల్లాలలో తక్కువ లేదా అత్యల్ప వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి జూలై 17 మధ్య సాధారణ వర్షపాతం 162.6 మి.మీ. కాగా, రాష్ట్రంలో 106.3 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్ర ప్రాంతంలోని గుంటూరు, పల్నాడు, విజయనగరం జిల్లాలు.. అలాగే రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో సాధారణం లేదా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

Also Read:RAW NTR చుట్టూ వివాదం.. సాయిరూప్ క్లారిటీ ఇదే!

రాష్ట్రంలోని ఈ జిల్లాలు మినహా, మిగిలిన జిల్లాలలో తక్కువ లేదా భారీ లోటు వర్షపాతాన్ని నమోదు చేసినట్లు ఐఎండీ వెల్లడించింది.పశ్చిమ గోదావరి, అన్నమయ్య, యానాం జిల్లాల్లో 60 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 50 శాతం కంటే ఎక్కువ లోటు నమోదైంది. అలాగే తిరుపతి, కడప, బాపట్ల, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, ప్రకాశం జిల్లాల్లో 40 శాతం కంటే ఎక్కువ వర్షపాత లోటు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అనంతపురం జిల్లాలో మాత్రమే సాధారణ స్థాయికి సమానమైన 95.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 1 నుంచి జూలై 17 వరకు సాధారణ వర్షపాతం 192.7 మిల్లీమీటర్లతో పోలిస్తే 35 శాతం లోటుతో 126 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

Also Read:ట్రాన్స్ జెండర్లకు పదవులు! 

రాయలసీమకు సంబంధించి సాధారణంగా కురవాల్సిన 119.9 మి.మీ వర్షపాతానికి బదులుగా 83.3 మి.మీ వర్షపాతం నమోదైందని.. ఇది 31 శాతం లోటని ఐఎండీ తెలిపింది.మరోవైపు జూలైలో రుతుపవనాల వేగం మందగించడంతో.. గత వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనేక జిల్లాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. జూలైలో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. మరోవైపు ఎల్ నినో ప్రభావంతో, దేశంలోని అనేక ప్రాంతాలు వర్షాభావాన్ని ఎదుర్కొనవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడితే, రుతుపవనాలు తిరిగి బలం పుంజుకోవచ్చని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు