Homeసినిమాఅనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ రూమర్స్.. ఇక నా జీవితం నాదే అంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్

అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ రూమర్స్.. ఇక నా జీవితం నాదే అంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్

క్రైమ్ మిర్రర్, సినిమా:- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి ఆమె కొత్త సినిమా కారణంగా కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వరుస ఎమోషనల్ పోస్టుల కారణంగా వార్తల్లో నిలిచారు. ఆమె చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత వ్యక్తిగత జీవితంలో కీలక మార్పు జరిగిందా? తమిళ నటుడు ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్ జరిగిందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. 2015లో మలయాళ చిత్రం ప్రేమమ్ తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్, తెలుగులో అ ఆ, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ వంటి విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. సంప్రదాయ పాత్రలతో పాటు గ్లామర్, విభిన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

ప్రభాస్ తర్వాత రవితేజ.. తెలుగులో మలయాళీ హీరోయిన్ హవా!

గత కొంతకాలంగా అనుపమ, తమిళ నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో ప్రేమలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇద్దరూ కలిసి బైసన్ సినిమాలో నటించగా, షూటింగ్ సమయంలో సన్నిహితమయ్యారనే వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి కనిపించిన కొన్ని ఫొటోలు వైరల్ కావడంతో ఈ ప్రచారం మరింత బలపడింది. అయితే తమ రిలేషన్‌షిప్‌పై అనుపమ లేదా ధ్రువ్ విక్రమ్ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.తాజాగా అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్టులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఈ పోస్టు పెట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదని, ఇకపై తన జీవితాన్ని తానే ఎంచుకుంటానని, ముగిసిపోయిన మార్గాలను వదిలి ముందుకు సాగుతున్నానని ఆమె పేర్కొన్నారు. అలాగే తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపై తన జీవితాన్ని తన ఇష్టానుసారం జీవిస్తానని భావోద్వేగంగా రాశారు.ఈ పోస్టుల్లో ధ్రువ్ విక్రమ్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా, డెడ్ ఎండ్స్, నో మోర్ పర్మిషన్స్, చూజింగ్ మై లైఫ్ వంటి పదాలు ఉపయోగించడంతో బ్రేకప్ రూమర్స్‌కు మరింత ఊతం లభించింది. అంతేకాకుండా అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధ్రువ్ విక్రమ్‌ను అన్‌ఫాలో చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం అనుపమ శర్వానంద్ సరసన భోగి చిత్రంలో నటిస్తుండగా, ధ్రువ్ విక్రమ్ కూడా తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు