క్రైమ్ మిర్రర్, సినిమా:- మలయాళ నటి మాళవిక మోహనన్ మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్‌తో ది రాజా సాబ్ చిత్రంలో నటించిన తర్వాత ఆమె మరో తెలుగు ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ చిత్రానికి రాజ రాజ చోర, స్వాగ్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమాలో రవితేజ ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వచ్చినప్పటికీ, అందులో నిజం లేదని తెలుస్తోంది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హసిత్ గోలి శైలిలో సందేశాత్మక అంశాలు కలగలిపిన కథతో ఈ సినిమా రూపొందనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో సంబంధం లేదు…!
ది రాజా సాబ్ చిత్రంలో మాళవిక మోహనన్ గ్లామర్‌తో ఆకట్టుకున్నప్పటికీ, ముగ్గురు హీరోయిన్లు ఉండటంతో ఆమె పాత్రకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో టాలీవుడ్‌లో ఆమెకు కొత్త అవకాశాలు వెంటనే రాలేదు. అయితే రవితేజ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.హసిత్ గోలి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ సినిమాలో మాళవిక పాత్ర కూడా బలంగా ఉండే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. గ్లామర్‌తో పాటు నటనకు కూడా ప్రాధాన్యం ఉండటంతో ఈ చిత్రం ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇవ్వొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.ప్రస్తుతం మాళవిక మోహనన్ తమిళంలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ 2 చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తుండగా, పాకెట్ నవల్ అనే మరో ప్రాజెక్ట్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రవితేజ-హసిత్ గోలి సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.