క్రైమ్ మిర్రర్, సినిమా:- సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్ “అబ్జెక్షన్ మై లార్డ్” ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇటీవల తెలుగు హీరోలు వరుసగా ఓటీటీ ప్రాజెక్టులతో ఆకట్టుకుంటుండగా, ఇప్పుడు శ్రీకాంత్ కూడా ఓ ఆసక్తికరమైన లీగల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా మేకర్స్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. విడుదల చేసిన పోస్టర్‌లో కోర్టు బోనులో నిల్చున్న వ్యక్తి చుట్టూ మంటలు కనిపించే విజువల్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రతి అభ్యంతరమూ వ్యవస్థను సవాల్ చేస్తుంది.. ప్రతి గొంతుకూ వినబడే అర్హత ఉంది అనే ట్యాగ్‌లైన్ ఈ సిరీస్ కథపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
హైదరాబాద్‌లో కల్తీ ఆహారంపై ఉక్కుపాదం… భారీ దాడుల్లో షాకింగ్ నిజాలు బట్టబయలు!
ఈ సిరీస్‌లో శ్రీకాంత్ ప్రముఖ న్యాయవాది పరశురామ్ పాత్రలో కనిపించనున్నారు. సమాజంలో చోటుచేసుకునే కీలక అంశాలను కోర్టు రూమ్ నేపథ్యంలో చూపిస్తూ, న్యాయం కోసం జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. లీగల్ డ్రామాలు, థ్రిల్లర్ అంశాలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ సిరీస్ ఆకట్టుకునే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
శ్రీకాంత్‌తో పాటు ఈ సిరీస్‌లో అనన్య శర్మ, ముఖేష్ రిషి, మధుబాల, ప్రకాశ్ రాజ్, షఫీ, సుమన్, సిజ్జు మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు ముఖేష్ జి దర్శకత్వం వహించగా, డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు.ఇటీవల తెలుగు నటులు ఓటీటీ వేదికగా విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు శ్రీకాంత్ కూడా చేరుతున్నారు. కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన అబ్జెక్షన్ మై లార్డ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు: దెబ్బతిన్న రాజౌరి–పూంచ్ జిల్లాలు, పలువురు మృతి