క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయం:- ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్ మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధికి తాము గార్డియన్గా వ్యవహరిస్తామని, ఆ బాధ్యతను తాము తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అయితే, ఇందుకు గాను ప్రపంచ దేశాలు తమకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.హార్ముజ్ జలసంధి గుండా సాగే నౌకల రవాణాకు తాము భద్రత కల్పిస్తున్నందున, ప్రతి షిప్కి 20 శాతం ఫీజు చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇరాన్, అమెరికా మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య తలెత్తే పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ క్రైసిస్ (ఇంధన సంక్షోభం) కు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు.. ఇమిగ్రేషన్ చెక్పోస్ట్గా ప్రకటన!