క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ డెస్క్:- భారత స్టార్ బ్యాటర్, టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాల నుంచి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్‌కు టీమిండియా తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.
దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తేనే చోటు – బీసీసీఐ వర్గాలు:ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ (ANI) కథనం ప్రకారం.. బీసీసీఐకి చెందిన ఒక ఉన్నతాధికారి సూర్యకుమార్ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో (Team Plans) లేరు. అయితే దానర్థం అతనికి అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయని కాదు” అని సదరు అధికారి వెల్లడించారు. సూర్యకుమార్‌కు టీమిండియా డోర్స్ ఇంకా తెరిచే ఉన్నాయని, అతను తిరిగి జట్టులోకి రావాలంటే డొమెస్టిక్ క్రికెట్ (దేశవాళీ లీగ్స్) లో అద్భుతంగా రాణించాల్సి ఉంటుందని తెలిపారు. దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తే సెలక్టర్లు మళ్లీ అతని పేరును పరిశీలిస్తారని పేర్కొన్నారు.ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తదనంతరం అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు అతడిని దూరంగా పెట్టడమే కాకుండా, అతని చేతిలో ఉన్న టీ20 కెప్టెన్సీ బాధ్యతలను కూడా వేరే ఆటగాళ్లకు అప్పగించారు. ఈ నిర్ణయం అప్పట్లో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.బీసీసీఐ చేసిన ఈ తాజా ప్రకటనతో సూర్యకుమార్ యాదవ్ తిరిగి నీలి రంగు జెర్సీని ధరించాలంటే దేశవాళీ టోర్నీల్లో (రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటివి) అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మైదానంలో 360 డిగ్రీల షాట్లతో అలరించే సూర్య, త్వరలోనే మునుపటి ఫామ్‌ను అందుకొని జాతీయ జట్టులోకి ఘనంగా రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.
లార్డ్స్ వేదికగా మన మహిళల జట్టు సంచలనం: ఇంగ్లాండ్‌పై 270 పరుగుల తేడాతో చారిత్రక విజయం!
నాన్న పడిన కష్టాలే నన్ను ఈ స్థాయికి చేర్చాయి: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే భావోద్వేగం