బాపట్ల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రేపల్లె మండలం పెనుమూడి చెక్‌పోస్టు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ తాగునీటి కోసం వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి కిందకు దిగాడు. అయితే రోడ్డు వాలుగా ఉండటంతో ఆగి ఉన్న బస్సు ఒక్కసారిగా కదిలి పక్కనే ఉన్న పంట కాల్వలోకి వెళ్లిపోయింది.
also read: ప్రేమ వివాహానికి అడ్డుగా నిలిచిందని అత్తని గొడ్డలితో చంపిన అల్లుడు.. కూతురు కళ్లముందే దారుణ హత్య
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కాల్వలోకి వెళ్లడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన వారు సురక్షితంగా బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
also read: యువతిపై కత్తితో దాడి.. ఆటోలో వెళ్తుండగా అటాక్, నిందితుడి పరార్