క్రైమ్ మిర్రర్, సినిమా:- నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి కాస్టింగ్ పై డైరెక్టర్ కొరటాల శివ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో బాలయ్యకు అన్న పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సంజయ్ దత్ పాత్ర అత్యంత పవర్ ఫుల్ గా ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం.ఇటీవలే సంజయ్ దత్ హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాలయ్య సినిమాలో నటించనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వెలువడితే అభిమానులకు పండగే అని చెప్పాలి.
ఓటరు జాబితాలో పేరు లేకపోతే చనిపోయినట్లే: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు!
స్టార్ హీరోతో నటించాలని కల.. ఛాన్స్ వస్తే వెంటనే ఓకే అంటున్న నాగదుర్గ