హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ, కమర్షియల్ హబ్ శరవేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదికలు వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. కోకాపేట నియో-పోలిస్ ఫేజ్-2 లేఅవుట్లలో వాణిజ్య స్థలాల ధరలు చదరపు గజానికి ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు స్థాయి మార్కును తాకాయి. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, బహుళ అంతస్తుల నిర్మాణాలకు లభిస్తున్న అనుమతులే ఇక్కడి భూములకు రెక్కలు రావడానికి ప్రధాన కారణం.ఒకప్పుడు బెంగళూరులోని ఎంజీ రోడ్ లేదా చెన్నైలోని ఓఎమ్ఆర్ ప్రాంతాలు దక్షిణాదిలోనే అత్యంత ఖరీదైన కమర్షియల్ స్థలాలుగా ఉండేవి. అయితే, గడిచిన కొద్దికాలంగా కోకాపేట పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రభుత్వ భూముల వేలం పాటలు , తాజా ప్రైవేట్ మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. వాటన్నింటినీ వెనక్కి నెట్టి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన , అత్యున్నత స్థాయి వాణిజ్య హబ్‌గా కోకాపేట నియో-పోలిస్ అవతరించింది.
Also Read:EV కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్!- టాటా ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ ఆఫర్లు
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు , అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఇక్కడ తమ కార్యాలయాలను స్థాపించేందుకు పోటీ పడుతుండటంతో ల్యాండ్ వాల్యూస్ భారీగా పెరిగాయి.నియో-పోలిస్ లేఅవుట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ ఎలాంటి ఎత్తు పరిమితులు లేకుండా వందలాది అంతస్తులతో స్కై స్క్రాపర్ భవనాలను నిర్మించుకునే వెసులుబాటు ఉంది. దీనికి తోడు 100 నుండి 150 అడుగుల వెడల్పు గల ట్రంక్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , పవర్‌లైన్ నెట్‌వర్క్, ఔటర్ రింగ్ రోడ్డుకు నేరుగా ఉన్న కనెక్టివిటీ వంటి మల్టీ-బిలియన్ డాలర్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడి భూములకు తిరుగులేని డిమాండ్‌ను తెచ్చిపెట్టాయి.
Also Read:విజయవాడ లాకప్ డెత్ కేసు: సాయికృష్ణ కుటుంబానికి వైసీపీ ఆర్థిక సాయం
ఈ వారం నమోదైన రికార్డు ధరలు పశ్చిమ హైదరాబాద్ శివార్ల రియల్ ఎస్టేట్ సామర్థ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్ కు చాటిచెప్పాయి.ఈ స్థాయి రేట్లు కేవలం కమర్షియల్ ల్యాండ్స్ కే పరిమితం కాకుండా.. పరిసరాల్లోని నార్సింగి, గండిపేట, పుప్పాలగూడ వంటి మైక్రో-మార్కెట్లలోని రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, లగ్జరీ విల్లాల ధరలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకవైపు ఇన్వెస్టర్లకు ఇది భారీ లాభాలను తెచ్చిపెడుతున్నా.. సాధారణ, మధ్యతరగతి కొనుగోలుదారులకు పశ్చిమ హైదరాబాద్ ప్రాపర్టీలు మరింత భారంగా మారనున్నాయి.
Also Read:ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విషాదం.. ఫీజు సరిచేస్తూ విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి