Homeతెలంగాణహైదరాబాద్:బిర్యానీ.. ఓ ఎమోషన్!

హైదరాబాద్:బిర్యానీ.. ఓ ఎమోషన్!

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ :- భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఇది కేవలం ఓ ఫుడ్ ఐటమ్ కాదు.. ఎంతో మందికి ఓ అనుభూతి, ఎమోషన్. ఇద్దరు మిత్రులు కలిస్తే, ఇంట్లో వేడుక జరిగితే, ఆదివారమొస్తే తినాలనిపించే ఫుడ్. పర్షియన్, మొఘల్ సంస్కృతుల నుంచి వచ్చి హైదరాబాద్‌కు డెస్టినేషన్‌గా మారింది. ఆ తర్వాత దేశమంతా విస్తరించింది. ఇప్పుడు ఎన్నో రకాలు, ఎన్నో వెరైటీల్లో బిర్యానీ అందుబాటులో ఉంది. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ నుంచి వెజ్ బిర్యానీ వరకు ఎన్నో రుచుల్లో భోజన ప్రియులను అలరిస్తోంది.ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. ఇక్కడి బిర్యానీ రుచి చూడకుండా వెళ్లే పర్యాటకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి గల్లీలో, ప్రతి రెస్టారెంట్‌లో బిర్యానీ ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్టైల్‌లో బిర్యానీ తయారు చేస్తారు. దమ్ బిర్యానీ, కచ్చి బిర్యానీ, మండి బిర్యానీ ఇలా ఎన్నో రకాలు భోజన ప్రియుల మనసు దోచుకుంటున్నాయి.నేడు (జూలై మొదటి ఆదివారం) ‘వరల్డ్ బిర్యానీ డే’. ఈ సందర్భంగా మీ ఇష్టమైన బిర్యానీ రకాన్ని, దానికి సంబంధించిన జ్ఞాపకాలను మాతో పంచుకోండి. మీకు ఏ బిర్యానీ ఇష్టం? కామెంట్ చేయండి.

మహిళల టీ20 వరల్డ్ కప్: నేడే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహా సంగ్రామం!

ప్రధాని మోదీకి బెదిరింపులు.. మృత్యువు కోసం వస్తున్నట్టే అని హెచ్చరిక.!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు