Homeజాతీయంప్రధాని మోదీకి బెదిరింపులు.. మృత్యువు కోసం వస్తున్నట్టే అని హెచ్చరిక.!

ప్రధాని మోదీకి బెదిరింపులు.. మృత్యువు కోసం వస్తున్నట్టే అని హెచ్చరిక.!

క్రైమ్ మిర్రర్,జాతీయం:- భారత ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్రస్థాయిలో బెదిరింపులు వచ్చాయి. ప్రధాని మోదీ ఆస్ర్టేలియా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయనున్న లక్ష్యంగా చేసుకుని కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధాని మోదీ ఆస్ర్టేలియా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు సంబంధించి ప్రమోషన్‌ కోసం ఉద్ధేశించి చేసిన ఒక పోస్టుకు కామెంట్‌ రూపంలో నిం దితులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అబూ ముస్తాఫా పేరిత ఉన్న అకౌంట్‌ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టు గుర్తించారు. ఈ పోస్టులో సదరు వ్యక్తి ప్రధాని మోదీని ఉద్ధేశించి.. ’స్టేడియం రూఫ్‌టాప్‌ను మూసేస్తే మంచిది. ఈ కార్యక్రమానికి మోదీ రావడమంటే మృత్యువు కోసం వస్తున్నట్టే’ అని కామెంట్‌ చేశారు. ఈ హెచ్చరిక పోస్టు వైరల్‌ కావడంతో ఆస్ర్టేలియా ఫెడరల్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన అక్కడి పోలీసులు ఈ పోస్టు ఏ ఐపీ అడ్రస్‌ నుంచి వచ్చిందో గుర్తించారు. అయితే, ఈ వ్యవహారంలో ఎవరైనా అరెస్టు చేశారా.? లేదా.? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆస్ర్టేలియా అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి వివిధ కోణాల్లో పలు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

మూడు రోజులపాటు ప్రధాని పర్యటన..

ప్రధాని మోదీ జూలై 8 నుంచి 10 మధ్య ఆస్ర్టేలియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జూలై 9న మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ ఈవెంట్‌లో పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆస్ర్టేలియా – ఇండియా వార్షిక సమావేశాల్లో కూడా పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాలు గురించి ఆస్ర్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పాల్గొనే ఈవెంట్‌కు సంబంధించిన దానిపై తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్‌ చేసే ఉద్ధేశంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ప్రమోషన్‌ కోసం ఏర్పాటు చేసిన ఒక పేజ్‌లోనే సదరు వ్యక్తి ప్రధాని మోదీని హెచ్చరిస్తూ కామెంట్‌ చేశాడు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించడంతో కామెంట్‌ చేసిన వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

పవన్‌పై గాదె సాయి కృష్ణ తల్లి తీవ్ర విమర్శలు.. బుద్ధి చెప్పావంటూ ఆగ్రహం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు