ఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అయోధ్య రాముడు కి భక్తుల సమర్పించిన విరాళాలు దోపిడీ కేసులో లోతుగా విచారిస్తున్న కొద్ది కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు తాజాగా మరికొన్ని విషయాలను గుర్తించారు. నగదు విరాళాలను లెక్కించే సిబ్బంది నోట్ల కట్టలను తమ దుస్తుల్లో, సాక్సుల్లో దాచుకొని బయటకు తీసుకువెళ్లిన విషయాన్ని తాజాగా గుర్తించారు. గడిచిన 45 రోజులుగా ఆలయంలోని సిసి ఫుటేజీలను సిట్ అధికారులు బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే నగదు లెక్కించే సిబ్బంది చేసిన అక్రమాలు బహిర్గతమైనట్లు తెలుస్తోంది.
నగదు లెక్కింపు విధుల్లో ఉన్న ఐదుగురు సిబ్బంది నోట్ల కట్టలను దాచుకుంటున్న దృశ్యాలు కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఆధారాలను ఆధారంగా చేసుకుని అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే విరాళాలు లెక్కింపు కేంద్రం వద్ద ఉన్న సిసి ఫుటేజీ వివరాలు కూడా మాయం చేసినట్లు తెలుస్తోంది. గడిచిన 45 రోజులు వరకే సీసీ ఫుటేజీలో సమాచారం ఉందని, మిగిలిన డేటా లేకపోవడంతో ఈ దోపిడీ ఎంత కాలం నుంచి జరుగుతుందో తెలియడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇకపోతే భక్తుల నుంచి వచ్చే విలువైన కానుకలకు ఎటువంటి లెక్కపత్రం లేకపోవడంతోనే ఈ తరహా దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read:మాన్సూన్ హెయిర్ ఫాల్‌కు చెక్.. ఈ అలవాట్లు మార్చేస్తే చాలు
విరాళాలు అందించే భక్తులకు రసీదులు ఇవ్వకపోవడంతో వారు ఇచ్చే అత్యంత ఖరీదైన వస్తువులు, నగదును ఇలా బయట మార్గంలో దోపిడీ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆలయ పూజారుల్లో ఒకరైన మహత్యం వినోద్ మిశ్రా అధికారులు విచారణలోను వెల్లడించారు. ముంబై కు చెందిన తన శిష్యుల్లో కొందరు అయోధ్య రాముడికి వెండి పాదుకులు, ఇతర ఆభరణాలను అందించారని, దానికి సంబంధించిన రసీదును నేలలు గడిచిన ఇవ్వలేదని వెల్లడించారు. ఇలాంటి అనేక మోసాలు ఆలయంలో జరిగినట్లు తాజా విచారణలో అధికారులు గుర్తిస్తున్నారు. ఈ వ్యవహారం ఎప్పటినుంచి సాగుతుందో తెలియడం లేదని సదరు మిశ్రా పేర్కొన్నారు.
భారీగా నగదు స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు…
Also Read:ప్రకాశ్ రాజ్ ఫైర్.. జనసైనికుల తీరుపై తీవ్ర విమర్శలు!
ఈ విచారణలో భాగంగా ఇప్పటి వరకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కింపులో పాల్గొన్న అవినీష్ నుంచి ఇప్పటివరకు రూ.20.39 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ఇతర నిందితుల అయినా కరుణేష్ పాండే నుంచి రూ.18.07 లక్షలు, అను కల్పు మిశ్రా నుంచి రూ.14.25 లక్షలు, రమాశంకర్ మిశ్రా నుంచి రూ.7.32 లక్షలు, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ నుంచి లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న మిగిలిన వారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలుస్తోంది