Homeక్రైమ్గొంతు కోసి భార్య‌ హత్య.. పూజ గదిలో దారుణం!

గొంతు కోసి భార్య‌ హత్య.. పూజ గదిలో దారుణం!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లా హోసపేటిలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని 32 వ వార్డులో ప్రభావతి (50) అనే మహిళ ఉంటోంది. గత కొన్నాళ్లుగా ఆమె భర్త రామమూర్తితో ఆమెకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు వారికి సర్ది చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ గొడవలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు సద్దుమనగా లేదు. ఈ క్రమంలోనే ప్రభావతి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తోంది. పూజ చేస్తున్న సమయంలో బయట నుంచి వచ్చిన రామమూర్తి నేరుగా పూజ గదిలోకి ప్రవేశించాడు. పూజ చేస్తున్న ప్రభావతి పైకి వెళ్లి కత్తితో గొంతు కోసి హతమార్చాడు.

Also Read:BMS Apps Ban: ఒక్క క్లిక్ తో ఈ-రిక్షా షట్‌ డౌన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం!

ఒక్కసారిగా పైకి వచ్చి దారుణానికి పాల్పడడంతో ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయింది. గొంతు తీవ్రంగా కోయడంతో ప్రభావతి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన తర్వాత రామమూర్తి అక్కడ నుంచి పరారైనట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. కుటుంబ కలహాలు ఉండడం వల్లే ఈ హత్యకు పాల్పడినట్లు స్థానికులు పోలీసులకు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు కొద్ది రోజుల్లోనే తెలుస్తాయని జిల్లా ఎస్పీ జాహ్నవి వెల్లడించారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ కేసును నమోదు చేశారు.

స్థానికంగా కలకలం సృష్టించిన ఈ హత్య…

Also Read:Sai Krishna Custodial Death: స్టేషన్ టెర్రస్‌ పై ఎముకలు, బూడిద.. సాయికృష్ణ కేసులో షాకింగ్ ట్విస్ట్!

ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబ కలహాలతో కొన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ తరహా దారుణానికి పాల్పడతాడని తాము ఊహించలేదని స్థానికులు చెబుతున్నారు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయని, ఈ క్రమంలోనే పలుమార్లు గొడవలు పడినట్లు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు, ఇతర పెద్దలు వీరి మధ్య రాజీ కుదిరిచే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

Also Read:Luxury Hotel Scam: టూర్ గైడ్ అంటూ ఎంట్రీ.. బిల్లు కట్టకుండానే ఎగ్జిట్.. ఏకంగా 300 హోటళ్లను బురిడీ కొట్టించిన ముసలోడు!

ఈ క్రమంలోనే రామమూర్తి తన భార్యపై మరింత పగను పెంచుకొని హత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య చేసిన అనంతరం రామమూర్తి పరారయ్యాడు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. నిందితుడు అదుపులోకి తీసుకున్న తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. వీలైనంత వేగంగా నిందితుడు రామమూర్తిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే మృతురాలు ప్రభావతికి ఎంతమంది పిల్లలు, వారు ఎక్కడ ఉంటున్నారు అన్న విషయాలపై స్పష్టత లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు