Homeక్రైమ్ఖ‌మ్మంలో అంత‌రాష్ర్ట దొంగ అరెస్టు...! బంగారు, వెండి ఆభ‌ర‌ణాలు స్వాధీనం...

ఖ‌మ్మంలో అంత‌రాష్ర్ట దొంగ అరెస్టు…! బంగారు, వెండి ఆభ‌ర‌ణాలు స్వాధీనం…

ఖ‌మ్మం, క్రైమ్‌మిర్ర‌ర్‌: గ‌త కొన్ని నెల‌లుగా రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్ళ‌ను ల‌క్ష్యంగా చేసుకొని దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న అంత‌రాష్ర్ట దొంగ‌ను అరెస్టు చేసిన‌ట్లు ఏసీపీ ర‌మ‌ణ మూర్తి తెలిపారు. అంత‌రాష్ర్ట దొంగ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో ప‌లు దొంగ‌త‌నాలు చేసిన‌ట్లు పేర్కొన్నారు. కాగా మంగ‌ళ‌వారం సాయంత్రం నగరంలోని కిన్నెర హోటల్ ఎదురుగా వున్న పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఖమ్మం టూ టౌన్, సిసిఎస్ పోలీసులకు అనుమానస్పదంగా కనిపించిన ఆత్కూరు గ్రామం, మధిర మండలం, ఖమ్మం జిల్లా సెన్ట్రింగ్ వర్కర్ అయిన నిందితుడు కంబంపాటి ఏసోబు అలియాస్‌ కందుల సురేష్ రెడ్డి, 45సం ను అదుపులోకి తీసుకొని విచారించగా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

Also Read:యుద్ధం దిశగా అమెరికా అడుగులు.. చివరి క్షణంలో వెనక్కి తగ్గిన ట్రంప్.!

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్టాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్ళల్లో దొంగతనాలు చేసి, పలుసార్లు జైలు శిక్షలు అనుభవించాడని ,ఇతనిపై గతంలో 22 దొంగతనాల కేసులలో నిందితుడు గా ఉన్నట్లు తెలిపారు.నిందితుడు నుండి 32 లక్షల విలువ చేసే 32 తులాల బంగారు ఆభరణాలు, 40 వేల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. గత సంవత్సరం నుండి వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలో చేసిన దొంగతనాల వివరాల ప్రకారం…1) ఖమ్మం 2వ టౌన్-4 2)ఖానాపురం హవేలీ -3 3) వేంసూరు-1,4) VM బంజర -1, 5)చిల్లకల్లు -1, 6)తిరువూరు -1 ల్లో దొంగతనాలు చేసాడని ఏసీపీ తెలిపారు.సమావేశంలో ఇన్స్పెక్టర్లు, కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్, ఎస్సై రమేష్ పాల్గొన్నారు.

Also Read:తెలంగాణ పాలిటిక్స్‌లో ‘11 AM’ హైటెన్షన్.. ‘సై’ అంటే ‘సై’ అంటున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్!!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు