Homeఆంధ్ర ప్రదేశ్లో "బీపీ" కి చెరుకు రసం నిజంగా ఉపయోగపడుతుందా...?

లో “బీపీ” కి చెరుకు రసం నిజంగా ఉపయోగపడుతుందా…?

Crime Mirror,Health Updates: బాలీవుడ్ నటి నేహా ధూపియా చెరుకు రసం తాగిన తర్వాత తన బీపీ పెరిగిందని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చాలామందిలో చెరుకు రసం లో బీపీని తగ్గిస్తుందా అనే సందేహం మొదలైంది. ఈ అంశంపై ఆరోగ్య నిపుణులు స్పష్టత ఇచ్చారు.

  • ఎలా ఉపయోగపడుతుంది?

నిపుణుల ప్రకారం చెరుకు రసంలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి, డీహైడ్రేషన్ వల్ల వచ్చే తాత్కాలిక లో బీపీ లక్షణాలను తగ్గించడంలో కొంత సహాయపడుతుంది. ఎండలో ఎక్కువసేపు ఉండటం లేదా ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల బీపీ తగ్గినప్పుడు చెరుకు రసం ఉపశమనం కలిగించవచ్చు.

  • బీపీ పెరుగుతుందా?

చెరుకు రసం నేరుగా రక్తపోటును పెంచే ఔషధం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది శరీరంలో శక్తి, ద్రవాల స్థాయిని మెరుగుపరచడం ద్వారా మాత్రమే తాత్కాలికంగా మెరుగైన అనుభూతిని కలిగిస్తుంది. తరచూ బీపీ పడిపోతుంటే అసలు కారణాన్ని గుర్తించేందుకు వైద్యులను సంప్రదించడం అవసరం.

  • జాగ్రత్తలు తప్పనిసరి

లో బీపీ తరచూ రావడం, స్పృహ కోల్పోవడం, ఛాతి నొప్పి, తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు ఉంటే చెరుకు రసంపైనే ఆధారపడకూడదు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చెరుకు రసంలో చక్కెర ఎక్కువగా ఉండటంతో వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.

  • సడెన్‌గా బీపీ పడిపోతే

బీపీ ఒక్కసారిగా తగ్గితే ముందుగా ప్రశాంతంగా కూర్చోవడం లేదా పడుకోవాలి. డీహైడ్రేషన్ అనిపిస్తే నీరు లేదా ఓఆర్‌ఎస్ వంటి ద్రవాలు తీసుకోవాలి. చాలాసేపు ఏమీ తినకపోతే తేలికపాటి పోషకాహారం తీసుకోవడం మంచిది. అయితే తరచూ ఈ సమస్య వస్తుంటే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు