Homeతెలంగాణరైతులకు అండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు..!

రైతులకు అండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు..!

-తలకొండపల్లిలో రేపు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.. సన్న రకాలకు క్వింటాలుకు రూ.500 బోనస్*

క్రైమ్ మిర్రర్,కల్వకుర్తి:- వానాకాలం 2026–27 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా తలకొండపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించనున్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం గ్రేడ్‌–ఏ రకానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర లభించనుంది. అదనంగా గుర్తించిన ఏడు సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లించనున్నారు. బీపీఎటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్‌ సెగ్మెంట్‌, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్‌ 44, కేఎన్‌ఎం 7715 రకాలకు ఈ బోనస్‌ వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు.

నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి…

రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, చెత్త, తాలు, మట్టి పెడ్డలు, రాళ్లు లేకుండా శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచించారు. ధాన్యంలో తేమ శాతం 17 శాతానికి మించకూడదని స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం ఉంటేనే ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు..ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే జిల్లా కంట్రోల్‌ రూమ్‌ను లేదా రాష్ట్ర టోల్‌ఫ్రీ నంబర్లు 1967, 1800 425 00 333ను సంప్రదించాలని అధికారులు కోరారు.

ఫ్రెషర్స్‌ పార్టీకి కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపు…

తలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఫ్రెషర్స్‌ పార్టీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం 11:30 గంటలకు దేవకీ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తలకొండపల్లి మండల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, లింగరావుపల్లి సర్పంచ్‌ కాసు శ్రీనివాస రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి మండల ముఖ్య నాయకులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ నాయకులు, మహిళా కాంగ్రెస్‌ నాయకులు, యువజన కాంగ్రెస్‌ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు, రైతులు, కాంగ్రెస్‌ శ్రేణులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మీడియా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

మాదాపూర్‌లో సర్వీస్ అపార్ట్‌మెంట్ల పై పోలీసుల నిఘా!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు