క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన ఒక సభలో ఆయన ప్రసంగిస్తూ, YCP పాలనలో గ్రామ పంచాయతీల దుస్థితిని ఎండగట్టారు.
గత ఐదేళ్లలో (2019-2024), గ్రామ పంచాయతీలకు కనీస నిధులు కూడా కేటాయించలేదని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేని దయనీయ పరిస్థితి ఉండేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పంచాయతీల అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుత ప్రభుత్వం ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చడానికి కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, పంచాయతీ రాజ్ శాఖను మరింత బలోపేతం చేసినట్లు పవన్ తెలిపారు.
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాంట్రాక్టర్లు పనులను నాణ్యతతో, సక్రమంగా చేస్తున్నారో లేదో ప్రజలు స్వయంగా పరిశీలించాలని కోరారు. ఒకవేళ పనుల్లో ఏవైనా లోపాలు కనిపిస్తే, వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు.
మాదాపూర్‌లో సర్వీస్ అపార్ట్‌మెంట్ల పై పోలీసుల నిఘా!
