Homeఅంతర్జాతీయంహౌతీల దాడుల వేళ సౌదీకి పాకిస్థాన్ భరోసా.. సైనిక సాయంపై రక్షణ మంత్రి కీలక ప్రకటన

హౌతీల దాడుల వేళ సౌదీకి పాకిస్థాన్ భరోసా.. సైనిక సాయంపై రక్షణ మంత్రి కీలక ప్రకటన

యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్ వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సౌదీ అరేబియాకు తాజాగా మరోసారి మద్దతు లభించింది. ఈ క్లిష్ట సమయంలో సౌదీకి మద్దతుగా నిలుస్తామని అటు అమెరికా, ఇటు పాకిస్థాన్ గతంలో హామీలు ఇచ్చాయి. కానీ, తీరా సమయానికి ఆ దేశాలు ఆశించిన స్థాయిలో సాయం చేయకుండా సైలెంట్ అవ్వడంతో సౌదీకి నిరాశే ఎదురైంది. అగ్రరాజ్యాలు సహాయం చేస్తామని చెప్పి మిన్నకుండిపోవడంతో హౌతీలు సౌదీపై మరింతగా విరుచుకుపడ్డారు.అయితే, ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ తాజాగా మరోసారి ముందుకొచ్చింది. ‘మక్కా డీల్’ మేరకు సౌదీ అరేబియాకు తాము పూర్తిగా అండగా ఉంటామని పాక్ తాజాగా ప్రకటించింది. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా స్పందిస్తూ.. తమ దేశ సైనిక సామర్థ్యాలు, రక్షణ వనరులు అన్నీ సౌదీ అరేబియాకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, సౌదీ అరేబియాకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తాము తీవ్రంగా పరిగణిస్తామని, “సౌదీ శత్రువు తమకూ శత్రువేనని” రక్షణ మంత్రి ఖవాజా కుండబద్దలు కొట్టారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ పాక్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, గతంలో సాయం చేస్తామని బీరాలు పలికి చేతులెత్తేసిన పాకిస్థాన్.. ఇప్పుడు చేసిన ఈ తాజా ప్రకటనకు ఎంతవరకు కట్టుబడి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న వేళ ఇచ్చిన మాట మీద పాక్ నిజంగానే నిలబడుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

రైతులకు అండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు