Homeఅంతర్జాతీయంవియ‌త్నాంలో రోడ్డు ప్ర‌మాదం...! ఇద్ద‌రు భార‌తీయ యోగ‌శిక్ష‌కుల మృతి...

వియ‌త్నాంలో రోడ్డు ప్ర‌మాదం…! ఇద్ద‌రు భార‌తీయ యోగ‌శిక్ష‌కుల మృతి…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఉపాధి కోసం వియ‌త్నాం వెళ్లి అక్క‌డ యోగా శిక్ష‌కులుగా రాణిస్తున్న ఇద్ద‌రు భార‌త‌తీయ యువ‌కులు ఈ నెల 25న జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందారు. ఈప్ర‌మాదంలో జార్ఖండ్‌కు చెందిన రాజకుమార్ వ‌ర్మ‌( 25),విన‌య్ యాద‌వ్‌(23)లు ప్రాణాలు కోల్పోయారు. వీరు రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయార‌ని తెలియ‌డంతో వారి గ్రామాల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. కాగా వివ‌రాలు ఇలా ఉన్నాయి. యోగా క్లాసులు ముగించుకుని బైక్‌పై తిరిగొస్తున్న స‌మ‌యంలో వర్షం కారణంగా రోడ్లు జలమయంమ‌య్యాయి. దీంతో బైక్ స్కిడ్‌ అయి అదుపుతప్పి, అటుగా వస్తున్న ఓ కారును బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంచీకి చెందిన రాజకుమార్‌ వర్మ అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన వినయ్‌ యాదవ్‌(జంషెడ్‌పూర్) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మృత్యువాతపడ్డారు.

వీరిరువురూ రెండేళ్లుగా వియత్నాంలో యోగా శిక్షకులుగా పనిచేస్తూ.. వాళ్ల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటున్నారు. కాగా.. ప్రమాదంలో ఇద్దరి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకురావడం వారి కుటుంబాలకు ఆర్థికపరంగా పెద్ద సమస్యగా మారినట్టు సమాచారం. నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంజయ్‌ ప్రసాద్‌ యాదవ్‌ తెలిపారు. మృతదేహాలను త్వరలోనే జార్ఖండ్‌కు తీసుకువచ్చే ఏర్పాట్లు చేపట్టినట్టు ఆయన చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సాయమందించే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  హైదరాబాదు: ఆ పబ్ కు వెళ్తే అంతే… యువతులతో హనీ ట్రాప్…!
  2.  కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు రెడీ…
  3.  దుర్గ‌మ‌ల్లేశ్వ‌ర ద‌స‌రా మ‌హోత్స‌వాల‌కు సీఎంకు ఆహ్వానం…!
  4. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో న‌ష్ట‌పోయి యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌…? గ్రామంలో విషాదం…

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు