క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరిని చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 1.5 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా చందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు.
అరెస్టైన వారిని విశాఖపట్నానికి చెందిన మెరిపాటి మనోజ్‌కుమార్ (22), విజయనగరం జిల్లాకు చెందిన ఎం. ఆశాజ్యోతి (23)గా గుర్తించారు. పోలీసుల విచారణలో ఒడిశాలోని కుందులి ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్టు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) పరీక్షలకు పంపించినట్లు చందానగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
also read ; హైదరాబాదు: ఆ పబ్ కు వెళ్తే అంతే… యువతులతో హనీ ట్రాప్…!
