Homeతెలంగాణభారీ వ‌ర్షా సూచ‌న‌..! ఆ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌...!

భారీ వ‌ర్షా సూచ‌న‌..! ఆ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌…!

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: తెలంగాణ రాష్ర్టంలో భారీ వ‌ర్షాలు కురిసే వ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. కాగా రాష్ర్టంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

Also Read:హైదరాబాద్‌లో నిరుద్యోగుల ఆందోళన: పోలీసు నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్

హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. రాత్రి వేళల్లో నగరంలో కొన్ని చోట్ల ఉరుములు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం పడవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 31°C, కనిష్ట ఉష్ణోగ్రత 22°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

Also Read:ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యభర్తల బలవన్మరణం- అనాథగా మారిన ఐదు నెలల శిశువు

తాజావార్తలు