Homeఆంధ్ర ప్రదేశ్OG 2 లో ఆమెకే ఛాన్స్...!

OG 2 లో ఆమెకే ఛాన్స్…!

Crime Mirror, Cinema Updates: OG – They Call Him OG విజయంతో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో దర్శకుడు సుజిత్ ఇప్పుడు OG 2 పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల కథా చర్చలు పూర్తైనట్లు చిత్రబృందం వెల్లడించగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.

సమాచారం ప్రకారం, ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్‌ను సుజిత్, పవన్ కల్యాణ్‌కు వినిపించగా, వాటికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథలో భాగంగా జపాన్‌లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

OG 2 కథ అంతర్జాతీయ మాఫియా ప్రపంచం, జపాన్ యాకుజా గ్యాంగ్స్ నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుందనే వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లలో కూడా నేతాజీకి సంబంధించిన సూచనలు కనిపించాయి.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఎక్కువ చర్చ జరుగుతున్న అంశం హీరోయిన్ ఎంపిక. పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశానికి ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఇద్దరితోనూ చర్చలు జరుగుతున్నాయని, వారి డేట్స్‌ను బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.

అయితే పూజా హెగ్డే పేరు ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి హీరోయిన్ ఎంపికపై పూర్తి స్పష్టత రావాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు