హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపును మరింత పెంచేలా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు గ్లోబల్‌గా చర్చనీయాంశమైంది. నగరంలోని ప్రముఖ ఫైనాన్షియల్ హబ్ గచ్చిబౌలి పరిధిలోని నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ఉన్న ఓ కీలక రహదారికి “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ”గా ఇటీవల నామకరణం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న కొద్దిరోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ గౌరవంపై ట్రంప్ తన స్పందనను తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పంచుకున్నారు. హైదరాబాద్‌లో తన పేరుతో రోడ్డును ఏర్పాటు చేయడం తనకు ఎంతో గర్వకారణమని, ఇది అరుదైన గౌరవమని పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో ఇలాంటి గుర్తింపు పొందిన తొలి అధ్యక్షుడిగా నిలవడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ అవెన్యూ అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి సమీపంలో ఉండటం ప్రత్యేకత. ఇటీవల జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు భారత్‌లోని అమెరికా ప్రతినిధి సంయుక్తంగా ఈ రోడ్డుకు సంబంధించిన నామఫలకాన్ని ఆవిష్కరించారు. భారత్‌లో ఒక అమెరికా అధ్యక్షుడి పేరును రహదారికి పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
హైదరాబాద్ ఐటీ, ఫైనాన్షియల్ రంగాల్లో వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చర్య ద్వారా నగర బ్రాండ్ విలువ పెరగడమే కాకుండా భారత్-అమెరికా మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ‘ట్రంప్ అవెన్యూ’ పేరు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ముద్ర వేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
also read: వరంగల్‌లో చిరుత కలకలం.. సీసీ కెమెరా దృష్యాలు వైరల్!