తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ శృతి హాసన్ తాజాగా స్పందించారు. తాను ప్రస్తుతం ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా శృతి హాసన్ వ్యక్తిగత జీవితంపై పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం సినిమాల కంటే వ్యక్తిగత జీవితం, సంగీతం మరియు ఇతర ఆసక్తులపై ఎక్కువ దృష్టి పెట్టిన శృతి, తరచూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆమె నేరుగా సమాధానాలు ఇస్తూ వారితో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవల ఓ అభిమాని ఆమెను “మీరు ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?” అని ప్రశ్నించాడు. దీనికి శృతి హాసన్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తాను ఎవరితోనూ ప్రేమ సంబంధంలో లేనని, ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని చెప్పారు. దీంతో ఆమె రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు చెక్ పడినట్టైంది.
మరో అభిమాని, “మీరు నటి కాకపోతే ఏ వృత్తిని ఎంచుకునేవారు?” అని ప్రశ్నించగా, శృతి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. చిన్నపిల్లల మానసిక వైద్యురాలిగా పనిచేయాలని తనకు ఎప్పటినుంచో ఆసక్తి ఉందని చెప్పారు. పిల్లల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన రంగంలో సేవ చేయాలనే కోరిక తనకు ఉందని వెల్లడించారు.
ఇదిలా ఉంటే, శృతి హాసన్ చివరిసారిగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించారు. అలాగే ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న Salaar: 2 సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం శృతి హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఆమె నిజాయితీగా సమాధానం చెప్పిన తీరును ప్రశంసిస్తున్నారు.