Homeతెలంగాణఈపీఎఫ్ఓ సేవ‌ల‌కు బ్రేక్‌...చందా దారులు బిగ్ అల‌ర్ట్‌...!

ఈపీఎఫ్ఓ సేవ‌ల‌కు బ్రేక్‌…చందా దారులు బిగ్ అల‌ర్ట్‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు ముఖ్యమైన సమాచారం. తాజాగా సిస్టమ్ ను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు జూన్ 26 నుంచి జూన్ 28 వరకు పోర్టల్ లో చాలా సేవలను తాత్కాలికంగా నిలిపినట్లు సంస్థ వెల్లడించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో తాజా సమాచారాన్ని సంస్థ వెల్లడించింది. ఈ మూడు రోజులపాటు కొత్త ఈపీఎఫ్ క్లైమ్ చేయడం, క్లెయిమ్లా ప్రాసెసింగ్ వంటి సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. ఈ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మూడు రోజుల్లో బిఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలని, ట్రాన్స్ఫర్ చేయాలని ప్లాన్ చేస్తే మరో మూడు రోజులపాటు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది.

Also Read:ప్రకృతిలో మాయలో మునిగే ప్రయాణం.. మధురానుభూతి అందించే పాకాల అందం

జూన్ 26వ తేదీ రాత్రి 12 గంటల నుంచి జూన్ 28వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు సేవలు నిలిచిపోతాయని పేర్కొంది. జూన్ 29 నుంచి సేవలు మళ్లీ ప్రారంభం కానున్నట్లు వివరించండి. తాజా నిర్ణయం నేపథ్యంలో కొత్త క్లైములు చేయలేరు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ప్రాసెసింగ్ కూడా తాత్కాలికంగా ఆగిపోతుంది. అదేవిధంగా క్లైమ్ లు రద్దు కావాలని కూడా ఈపీఎఫ్ స్పష్టం చేసింది. అత్యవసర సహాయం కోసం ఈపీఎఫ్ఓ హెల్ప్ లైన్ నెంబర్ 14470 అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈ తాత్కాలిక అంతరాయం వల్ల ఇబ్బంది కలిగిన భవిష్యత్తులో సేవలు మరింత వేగంగా అందించడానికి ఈ అప్గ్రేడ్ ఉపయోగపడుతుందని వినియోగదారులకు ఈపీఎఫ్ఓ సూచించింది.

ఈ సేవలకు అంతరాయం కలిగే అవకాశం…

Also Read:9 ఏళ్ల ప్రేమకు ముగింపు… పెళ్లితో ఒకటైన ఫైమా- ప్రవీణ్ నాయక్ జంట

తాజాగా చేపట్టిన ప్రక్రియ వల్ల మూడు రోజులపాటు ఈపీఎఫ్ఓ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి, బదిలీ చేసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించాలని ఈపీఎఫ్ఓ సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. మూడు రోజుల తర్వాత చేపట్టనున్న కీలక మార్పులు వల్ల త్వరిత గతిన సేవలు పొందేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది.

Also Read:పుట్టిన గడ్డపై మమకారం.. పౌరసత్వం కోసం 94 ఏళ్ళ వృద్ధురాలి ఆరాటం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు