హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: దేశంలోనే బల్క్, కమర్షియల్ ఎల్పిజి వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఆయా వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా వాణిజ్య గ్యాస్ సర్ఫరా పై విధించిన అన్ని రకాల తాత్కాలిక అంశలను కేంద్రం తక్షణమే ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు మేరకు దేశంలోనే బల్క్, కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.
Also Read:గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట… ! ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం…
పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో దేశంలోని ఆయా గ్యాస్ వినియోగదారులపై ప్రభుత్వం అదనపు భారాన్ని విధించింది. బల్క్ గ్యాస్ సరఫరా 50 శాతానికి పెంపు ప్యాకెడు సిలిండర్లతోపాటు, సంక్షోభం ప్రారంభమైన సమయంలో పూర్తిగా నిలిపివేసిన బల్క్ ఎల్పిజి సరఫరాపై కూడా కేంద్రం తాజాగా సడలింపులు ఇచ్చింది. పాత వినియోగంతో పోలిస్తే పరిశ్రమలకు 50% మేరా బల్బు గ్యాస్ సర్ఫరాను పునరుద్ధరించాలని చమరు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల హోటల్లు, రెస్టారెంట్లు, ఫార్మా ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్ వంటి భారీ అంగన ఆధారిత పరిశ్రమలకు గ్యాస్ కొరత తీరుతుంది.
ఈ కారణంతోనే కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం…
Also Read:కొత్త బస్సులో సీఎం విజయ్ సవారీ.. ప్రజలతో కలిసిన ‘రియల్ లీడర్’
తాజాగా కేంద్ర ప్రభుత్వం గతంలో నిలిపివేసిన బల్క్ ఎల్పిజి సరఫరా పై కూడా ఆంక్షలను సడలించింది. అలాగే దేశీయతర ప్యాకెడు ఎల్పిజి సరఫరా పై ఉన్న అన్ని రకాల రంగాల వారి పరిమితులను పూర్తిగా ఎత్తివేసింది. దీనికి అనేక అంశాలు కారణంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా దేశీయంగా ఎల్పిజి ఉత్పత్తి మెరుగుపడడం, దిగుమతి చేసుకునే ఎల్పిజి లభ్యత అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదే సమయంలో పారిశ్రామిక అవసరాలకు స్వచ్ఛమైన, సమర్థవంతమైన ఇంధనాన్ని అందించేందుకు చర్యలను చేపడుతున్నట్లు వెల్లడించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని నిర్ణయం వల్ల కొద్దిరోజులుగా ఓడిదుడుకులు ఎదుర్కొంటున్న హోటల్లు, రెస్టారెంట్లు, చిన్న మధ్య తరహా పారిశ్రామిక వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుతుంది.
Also Read:తమిళనాడులో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్… నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు