క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :-ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నిబంధనపై న్యాయపోరాటం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.నిన్న పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్’ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.ముఖ్యంగా, డీఎస్సీ (DSC) పరీక్ష రాసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి, ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్న తమకు ఇప్పుడు కొత్తగా టెట్ పరీక్ష ఎందుకని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా విద్యాబోధన చేస్తున్న తమకు ఈ నిబంధన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.ఉపాధ్యాయుల సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టెట్ నిబంధనను సవాల్ చేస్తూ పార్టీ తరఫున కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. అలాగే, తమ పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తామని, అవసరమైతే చట్టసవరణ జరిగేలా తమ వంతు కృషి చేస్తామని ఉపాధ్యాయులకు ఆయన భరోసా కల్పించారు.
ఏపీలో 28న పల్స్ పోలియో: 49.20 లక్షల మంది చిన్నారులకు చుక్కలు
El Nino Impact: ఎల్నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ సహా 111 జిల్లాలకు కరువు!