టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమా మొత్తాన్ని తన నటనతో ముందుకు నడిపించిన సమంతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
జూన్ 19న విడుదలైన ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఆమె లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. వేడుకలో సమంత బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు సమంత తల్లి కాబోతుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతుండగా, మరికొందరు ఇది సినిమా ప్రమోషన్లో భాగమా లేదా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన లుక్నా అని చర్చించుకుంటున్నారు.
అయితే సమంత గర్భవతి అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలుగానే కనిపిస్తున్నాయి. బేబీ బంప్ లుక్ వెనుక అసలు కారణం ఏమిటన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు మా ఇంటి బంగారం సినిమా విజయంతో సమంత అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కొంతకాలం విరామం తర్వాత ఆమె చేసిన రీఎంట్రీకి మంచి స్పందన రావడంతో కెరీర్లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం అయితే సమంత బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.