Homeతెలంగాణహైద‌రాబాద్‌లో భారీగా పెరిగిన ఇంటి అద్దెలు...! సామాన్యుల‌పై భారం...

హైద‌రాబాద్‌లో భారీగా పెరిగిన ఇంటి అద్దెలు…! సామాన్యుల‌పై భారం…

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: హైదరాబాద్ నగరంలో ఇండ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌ను నమ్ముకుని జీవిస్తున్న చిరు వ్యాపారులు, ఉద్యోగులు అద్దెల భారాన్ని తట్టుకోలేకపోతున్నారు. కరోనాకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం అద్దెలు రెట్టింపు అయ్యాయి. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం 2BHK ఫ్లాట్ అద్దె రూ. 25 వేల నుండి రూ. 45 వేల వరకు పలుకుతుండగా, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రూ. 15 వేలు చెల్లిస్తేనే దొరికే పరిస్థితి ఏర్పడింది.

Also Read:12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్!!

జూనియర్ ఉద్యోగులు తమ జీతంలో 40 నుండి 45 శాతం వరకు కేవలం అద్దెలకే వెచ్చించాల్సి వస్తోంది.ఇటీవలి నివేదికల ప్రకారం ఐటీ కారిడార్‌లో సగటు అద్దెలుగత ఏడాది కంటే 10% నుండి 15% వరకు పెరిగాయి. కోకాపేట్, ఖాజాగూడ ప్రాంతాల్లో లగ్జరీ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో అక్కడ ఇళ్ల ‘వేకెన్సీ రేట్’ 2 శాతం కంటే తక్కువగా ఉంది. ఐటీ హబ్‌లోనే కాకుండా మెహిదీపట్నం, అత్తాపూర్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు, మెట్రో ఫేజ్ 2 పనుల వల్ల ఉప్పల్, ఎల్బీనగర్ వంటి బడ్జెట్ ఏరియాల్లోనూ కిరాయిలు భారీగా పెరుగుతున్నాయి.

Also Read:హనుమకొండ బాలుడు నిరంజన్ ఇంటికి బండ్ల గణేష్.. రూ.5 లక్షల చెక్ అందజేత..

కేవలం అద్దె మాత్రమే కాకుండా అపార్ట్‌మెంట్లలో మెయింటెనెన్స్ చార్జీల పేరిట నెలకు రూ. 3 వేల నుండి రూ. 6 వేల వరకు వసూలు చేస్తుండటం మధ్యతరగతి నడ్డి విరుస్తోంది. దీనికి తోడు కరెంట్ బిల్లులు, జూన్ నెలలో వచ్చే స్కూల్ ఫీజుల భారం తోడవడంతో బతుకు బండి లాగడం కష్టంగా మారింది. అనరాక్ నివేదిక ప్రకారం ఇళ్ల కొనుగోలు ధరలు చదరపు అడుగుకు రూ. 9,456కు పెరగడం వల్ల కూడా యజమానులు అద్దెలను పెంచుతున్నారు. ఈ భారాన్ని భరించలేక చాలా కుటుంబాలు నగరాన్ని వదిలి ఓఆర్ఆర్ (ORR) అవతలి ప్రాంతాలకు వలస వెళ్తున్నాయి.

Also Read:ట్రంప్ కోసం రూ. 3,800 కోట్ల విలువైన సరికొత్త విమానం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు