క్రైమ్ మిర్రర్, హెల్త్:- సమయానికి నిద్రపోవడం, సరైన నిద్రను కలిగి ఉండటం అనేది మానవ శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత కీలకం. అయితే చాలామందికి ఏ వయసులో ఉన్నవారు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలనే దానిపై కచ్చితమైన అవగాహన ఉండదు. మనిషి వయసును బట్టి అవసరమయ్యే నిద్ర సమయాల్లో మార్పులు ఉంటాయని అంతర్జాతీయ పరిశోధన సంస్థ ‘స్లీప్ ఫౌండేషన్’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.ఈ నివేదిక ప్రకారం వివిధ వయసుల వారికి సిఫార్సు చేసిన నిద్ర సమయాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
వయసును బట్టి నిద్ర సమయాల పట్టిక:-
1.4 – 12 నెలల వయసు (శిశువులు): రోజుకు 12 నుండి 16 గంటలు (కునుకులతో కలిపి) నిద్రపోవాలి.
2. 1 – 2 ఏళ్లు (చిన్న పిల్లలు): వీరు రోజుకు 11 నుండి 14 గంటల పాటు నిద్రపోవడం అవసరం.
3. 3 – 5 ఏళ్లు (ప్రీ-స్కూల్ పిల్లలు): ఈ వయసు పిల్లలు శారీరక ఎదుగుదల కోసం రోజుకు 10 నుండి 13 గంటలు నిద్రపోవాలి.
4. 6 – 12 ఏళ్లు (బడికెళ్లే పిల్లలు): వీరికి రోజుకు కనీసం 9 నుండి 12 గంటల నిద్ర అత్యంత ముఖ్యం.
5. 13 – 18 ఏళ్లు (టీనేజర్స్): యవ్వనంలో అడుగుపెడుతున్న వీరు రోజుకు 8 నుండి 10 గంటలు నిద్రపోవాలి.
6. 18 ఏళ్లు పైబడిన వారు (వయోజనులు): ఈ వయసు వారు రోజుకు 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.
అతిగా నిద్రపోతున్నారా? అయితే ప్రమాదమే!సాధారణంగా నిద్ర తక్కువైతే అనారోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలుసు. కానీ, పెద్దలు రోజుకు 9 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతే అది కూడా ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరానికి మించి ఎక్కువగా నిద్రపోవడం అనేది శరీరంలో ఏదైనా అంతర్గత అనారోగ్య సమస్య ఉందనడానికి సంకేతం కావచ్చు. కాబట్టి వయసుకు తగినట్లుగా, క్రమశిక్షణతో కూడిన నిద్ర అలవాట్లను పెంపొందించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.