Homeక్రైమ్Bride Death Case: భార్యపై అనుమానం.. సీసీటీవీలతో నిఘా.. పెళ్లై రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య!

Bride Death Case: భార్యపై అనుమానం.. సీసీటీవీలతో నిఘా.. పెళ్లై రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య!

మహారాష్ట్రలో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెళ్లై రెండు నెలలు కూడా కాకముందే ఆమె చనిపోవడంతో స్థానికంగా కలకలం రేపింది. భర్త, అత్తింటి వారి వేధింపులే ఈ విషాదానికి కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

పోలీసుల వివరాల ప్రకారం, థానే ప్రాంతానికి చెందిన నితిన్ తిల్కర్ అనే వ్యక్తికి విశాఖ తిల్కర్ అనే యువతితో ఈ ఏడాది ఏప్రిల్ 30న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొద్దిరోజులు దంపతుల జీవితం సాధారణంగానే సాగింది. అయితే, అనంతరం భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలుస్తోంది.

భార్యపై నిఘా కోసం ఇంట్లో సీసీ కెమెరాలు

భార్యపై అనుమానం పెంచుకున్న నితిన్ ఇంటి లోపల, బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆమె కదలికలను నిరంతరం గమనించేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఎవరితో మాట్లాడినా అనుమానపడుతూ గొడవలకు దిగేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కారణంగా భార్య మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అత్తింటి సభ్యులు కూడా ఆమెను వేధించారని ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న కారణాలతో ఆమెను మందలించడం, అవమానించడం చేసేవాడు. ఈ పరిస్థితుల వల్ల విశాఖ తీవ్ర ఆందోళనకు గురై చివరకు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మరిన్ని ఆరోపణలు చేశారు. పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన కొన్ని  వస్తువుల విషయంలో అత్తింటి వారు ఒత్తిడి తెచ్చారని వారు తెలిపారు. ఈ వేధింపుల గురించి విశాఖ ఫోన్‌లో పలుమార్లు చెప్పి బాధపడిందని ఆమె తల్లి వెల్లడించారు.  కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు