క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను దారుణంగా వంచించిందని భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఏకంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని బీజేపీ గుర్తుచేసింది.అంతేకాకుండా, ప్రతి నిరుద్యోగికి నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫ్రీ స్కూటీ, వడ్డీ లేని రుణాలు ఇస్తామని యువతను నమ్మబలికిందని బీజేపీ పేర్కొంది. అయితే తీరా గద్దెనెక్కాక, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని, నిరుద్యోగ భృతి ఊసే ఎత్తకుండా యువతను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా ముంచిందని బీజేపీ నాయకులు విమర్శించారు. దీంతో మరోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య రచ్చ రగులుతుంది.
ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలి? ‘స్లీప్ ఫౌండేషన్’ కీలక నివేదిక!
Gang Rape Case: మహిళపై కిరాతకం.. మర్మాంగంలోకి ఆ వస్తువులను పెట్టి మరీ పైశాచికత్వం!