క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రముఖ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సత్యవన్ సావిత్రి’ విడుదలకు సిద్ధమైంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నారు.ప్రవీణ్ ఎ. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతం అందించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఆమె మునుపటి చిత్రం ‘రివాల్వర్ రీటా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ‘సత్యవన్ సావిత్రి’పై ఆమె అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఆమె మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు.
మెస్సీని తీసుకువస్తే విమర్శలు చేశారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Breaking: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ వెనుక ఉన్నది వాళ్లేనా…?