Homeక్రైమ్సారూ..నన్ను నా కొడుకు నుంచి రక్షించండి...! వృద్దురాలి క‌న్నీటి విన‌తి.....

సారూ..నన్ను నా కొడుకు నుంచి రక్షించండి…! వృద్దురాలి క‌న్నీటి విన‌తి…..

కొత్తగూడెం,క్రైమ్‌మిర్ర‌ర్‌: నా కొడుకు, కోడలు నుంచి తనను కాపాడి, నా ఆస్తి , నా పొలం నాకు ఇప్పించాలని పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన 85 సంవత్సరాల వృద్ధురాలు భట్టు కోమి కలెక్టర్ అంకిత్‌కు ఫిర్యాదు చేసింది. సోమవారం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసింది. భట్టు కోమికి ముగ్గురు కొడుకులు ఉండగా పెద్ద కొడుకు భట్టు రామ్ దన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మరో కుమారుడు భట్టు రవి దివ్యాంగుడు కాగా, మరొక తనయుడు భట్టు శ్రీనివాస్ మతిస్థిమితం కోల్పోయి బ్రతుకుతున్నారని తెలిపారు.

Also Read:US- Iran Deal: యుద్ధానికి ముగింపు.. ఇరాన్‌ తో డీల్ కుదిరిందన్న ట్రంప్!

అయితే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పెద్ద కొడుకు నన్ను మంచిగా చూసుకుంటానని నమ్మబలికి నా తదనంతరం కర్మకాండలు చేస్తానని చెప్పి వారి ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి స్థలం, నాలుగున్నర ఎకరాల పొలం కాగితాల పై నా సంతకం తీసుకొని ఇప్పుడు అన్నం పెట్టకుండా వేధింపులకు గురి చేస్తూ, దుర్భాషలాడుతున్నాడని, తనను కొడుతున్నాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. తనకు వస్తున్న పెన్షన్ కూడా లాగేసుకుంటున్నారని కన్నీటి పర్యంతమైంది. తన భూమి, తన పెన్షన్ డబ్బులు ఇప్పించి కొడుకు, కోడలు బారి నుండి రక్షించాలని కోరింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఈ అంశం పై వెంటనే విచారణ చేయాలని ఆర్డీవోకు లేఖ రాశారు.

Also Read:Bengaluru Murder Case: అనుమానం పెనుభూతమై.. ప్రియురాలిని కడతేర్చిన ఉన్మాది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు