Homeక్రైమ్యువ న‌టికి లైంగిక వేధింపులు...!కేసు న‌మోదు

యువ న‌టికి లైంగిక వేధింపులు…!కేసు న‌మోదు

హైదరాబాద్,క్రైమ్ మిర్ర‌ర్‌:కొన్నేళ్లుగా సినీ రంగంలో ఉన్న ఓ యువనటి(21)కి ఓ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ సంప్రదించాడు. 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తవగా, నటికి ఇవ్వాల్సిన రూ.90 వేల పారితోషికం, రూ.38 వేల ప్రయాణ చార్జీలు ఇవ్వకుండా ప్రసాద్ తప్పించుకున్నాడు.

Also Read:Yogi Adityanath: అఖిలేష్ కుమార్తెపై ట్రోలింగ్.. సీఎం యోగి సీరియస్!

ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన తనను కలవమని చెప్పి, బలవంతంగా కారులో ఎక్కించుకుని, తన కోరిక తీరిస్తే ఇతర సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని సదరు నటిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. నిందితుడి నుండి తప్పించుకుని, జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పడంతో, ప్రసాద్ను బాధితురాలి తల్లి నిలదీసింది. దీంతో ప్రసాద్ బాధితురాలి తల్లిని కూడా దూషించడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Also Read:చేపల కోసం వేస్తే మొసలి చిక్కింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు