Homeరాజకీయంపొలిటిక‌ల్ ల‌వ‌ర్‌ బాయ్ దువ్వాడా దారెటు...!!

పొలిటిక‌ల్ ల‌వ‌ర్‌ బాయ్ దువ్వాడా దారెటు…!!

విజయనగరం, క్రైమ్ మిర్ర‌ర్‌: రీల్స్ “రాజా” పరిస్థితి దారుణంగా మారిపోయింది. పుట్టింటి వాళ్ళు వదిలేశారు. నమ్ముకున్న పార్టీ తరిమేసిందన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. తాడేపల్లి నుంచి క్లియర్ మెసేజ్ వచ్చింది. రీ ఎంట్రీ లేదని అన్ని మూసుకొని కూర్చోవాలని.. పార్టీ అధిష్టానం చెప్పేసింది. ఇప్పుడు ఏం చేయాలి.. చీరలు అమ్ముకుంటూ.. రీల్స్ చేసుకుంటూ బతకాలి.. ఇది ఆ సిట్టింగ్ ఎమ్మెల్సీ పరిస్థితి.ఉత్తరాంధ్రలో దువ్వాడ శ్రీనివాస్ కు ఒకప్పుడు భారీగానే ఫాలోయింగ్ ఉండేది. ఫ్యాన్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీ కూడా. ఆయన జీవితంలోకి మాధురి రావడంతో పరిస్థితి మారిపోయింది. రాజకీయంలో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అనే సామెత అతని ద్వారా మరోసారి నిరూపితమైంది. భార్యను.. ఇద్దరి పిల్లల్ని వదిలిపెట్టి ఆయన తన దారితను చూసుకున్నాడు.

Also Read:Yogi Adityanath: అఖిలేష్ కుమార్తెపై ట్రోలింగ్.. సీఎం యోగి సీరియస్!

వృద్ధాప్యంలో యవ్వనం లాగా.. పడుచు కుర్రాడి లాగా రెచ్చిపోతున్నాడు. మాధురితో రీల్స్ చేయడం.. టీవీ చానల్స్ లలో ముద్దులు పెట్టడం.. ఇలా రకరకాల హంగామా చేస్తున్నాడు.దీనివల్ల 2024 లో పార్టీకి చాలావరకు డ్యామేజ్ జరిగింది. టెక్కలి నియోజకవర్గం లోనే కాకుండా.. ఉత్తరాంధ్ర మొత్తంలో పార్టీకి పెద్ద దెబ్బ పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పకపోయినప్పటికీ.. వచ్చి కలువు అన్నారు. అయితే ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు. చివరికి తాడేపల్లి ప్యాలస్ నుంచి క్లియర్ మెసేజ్ వచ్చేసింది. రీ ఎంట్రీ లేదని స్పష్టంగా వర్తమానం అందింది.వైసీపీలోకి మళ్ళీ వెళ్లడానికంటే ముందు శ్రీనివాస్ బిజెపి.. టిడిపి.. జనసేన నాయకులతో మంతనాలు జరిపారు.

Also Read:Indian Win: స్మృతి బ్యాటింగ్ మెరుపులు.. దీప్తి బౌలింగ్ మాయాజాలం.. పాక్‌ను చిత్తు చేసిన భారత్!

పార్టీలో చేర్చుకోవాలని వర్తమానం పంపించారు. ఏ పార్టీ నుంచి కూడా సరైన స్థాయిలో స్పందన రాలేదు. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ గేటు కాదు కదా కనీసం ప్రహరీ గోడ కూడా టచ్ చేయడానికి అవకాశం లేదని వర్తమానం అందడంతో శ్రీనివాస్ అంతర్మదనంలో ఉన్నారు. ఆయన సన్నిహితురాలు ప్రస్తుతం హైదరాబాదులో చీరల వ్యాపారం చేస్తున్నారు. ఆయన కూడా అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఉత్తరాంధ్రకు వెళ్లి పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అన్ని పార్టీలు డోర్లు క్లోజ్ చేయడంతో.. శ్రీనివాస్ ఏం చేస్తారు.. ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతారా.. లేక రీల్స్ చేసుకుంటూ.. సోషల్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.

Also Read:Divorce Cancelled: విడాకుల కోసం వెళ్లిన దంపతులు కోర్టులోనే ఒక్కటయ్యారు.. జడ్జి ముందే హ్యాపీ ఎండింగ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు