Crime Mirror, Cinema Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం చరణ్ కెరీర్లోనే అతిపెద్ద సోలో హిట్‌గా నిలిచింది.
సినిమా విజయం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబును, నిర్మాతలను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సరదా సంభాషణల్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: బాలయ్య కొత్త సినిమా.. సీఎం చంద్రబాబు క్లాప్…!
పెద్ది సినిమా చూసిన తర్వాత చాలా రోజుల వరకు ఆ కథ, పాత్రలు, సన్నివేశాలు తన మనసులో తిరిగాయని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా రామ్ చరణ్ నటన తనను ఎంతగానో కదిలించిందని చెప్పారు. సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో తాను దగ్గర నుంచి చూశానని, ఉదయం నుంచి రాత్రి వరకు వర్కౌట్స్, షూటింగ్స్‌తో శరీరాన్ని పూర్తిగా అంకితం చేశాడని గుర్తుచేశారు.
అయితే అసలు హైలైట్ బుచ్చిబాబు అడిగిన ఒక ప్రశ్నతో మొదలైంది. మీతో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఇవ్వండి సర్ అని దర్శకుడు కోరగా, చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. నువ్వు పరిగెత్తమని, దూకమని, వైర్లు కట్టి గాల్లో ఎగరమని చెబితే వెళ్లవయ్యా అంటా” అంటూ నవ్వులు పూయించారు. అయితే కథ కోసం అవసరమైతే ఎలాంటి కష్టానికైనా సిద్ధమేనని, కానీ అనవసరమైన రిస్కులు మాత్రం వద్దని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Also Read: రణ్‌బీర్ కల ఎప్పుడు నెరవేరుతుంది…?
ఇటీవల ఓ సినిమాలో వైర్ యాక్షన్ సీన్ చేస్తుండగా శరీరం మొత్తం గాయాలయ్యాయని చిరంజీవి గుర్తుచేశారు. ఆ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ కూడా షూటింగ్ యూనిట్‌పై సీరియస్ అయ్యాడని చెప్పారు. అయితే అది ఎవరి తప్పు కాదని, డూప్ చేయాల్సిన షాట్‌ను తానే చేయాలని పట్టుబట్టానని వివరించారు.
ఈ సందర్భంగా తన తండ్రి మాటలను కూడా చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తాను యువ హీరోగా ఉన్నప్పుడు చేసిన ప్రమాదకరమైన స్టంట్లను చూసి తన తండ్రి ఎంతగా ఆందోళన చెందేవారో చెప్పారు. ఇప్పుడు రామ్ చరణ్ కష్టపడుతుంటే అదే బాధ తనకూ అర్థమైందని భావోద్వేగానికి గురయ్యారు.
మొత్తానికి బుచ్చిబాబుతో సినిమా చేసే విషయంలో చిరంజీవి ఆసక్తి చూపినప్పటికీ, ఒక చిన్న కండీషన్ మాత్రం పెట్టేశారు. కథ కోసం ఎంత కష్టమైనా పడతానని, కానీ అనవసరంగా వైర్లు కట్టి గాల్లో ఎగరేయొద్దని సరదాగా చెప్పిన మాటలు ఇప్పుడు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read: Divorce Cancelled: విడాకుల కోసం వెళ్లిన దంపతులు కోర్టులోనే ఒక్కటయ్యారు.. జడ్జి ముందే హ్యాపీ ఎండింగ్!
Also Read: తొలి వరల్డ్ కప్‌లోనే డబుల్ గోల్డ్… తుర్కియేలో ధీరజ్ బొమ్మదేవర సంచలనం!