Homeతెలంగాణటిపిసిసి చీఫ్ ఔట్!

టిపిసిసి చీఫ్ ఔట్!

మీనాక్షి నటరాజన్ కేసులో పదవి నుంచి తొలగింపు
•ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా..
•హై కమాండ్ కు అందిన నివేదికలు..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మార్పు తప్పదా? ఆయనపై హై కమాండ్ వేటు వేయనుందా? పదవి నుంచి తప్పించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కారం ముమ్మాటికి తెలంగాణ పిసిసి చీఫ్ వైఫల్యంగా భావిస్తోంది అధిష్టానం. మహేష్ కుమార్ గౌడ్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పార్టీలో క్రమశిక్షణను కాపాడడంలో, అంతర్గత కుమ్ములాటులను అదుపు చేయడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని.. అందుకే ఆయన మార్పు తథ్యం అని ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

హై కమాండ్ సీరియస్ గా..
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కారం వెనుక తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు అన్నది బహిరంగ రహస్యం. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్రీయ వ్యవహారాల ఇంచార్జ్, గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తురాలుగా పేరు పొందారు మీనాక్షి నటరాజన్. అటువంటి ఆమె రాజ్యసభ నామినేషన్ హైదరాబాదులో ఓ కేసు కాని కేసు కారణంగా మధ్యప్రదేశ్ లో తిరస్కరణకు గురికావడం జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా ఎంపిక చేసిన ఒకే ఒక అభ్యర్థి సీటు సాంకేతిక కారణాలతో చేజారి పోవడం వెనుక తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేతలు ఉన్నారన్నది బయటకు వచ్చింది. అందుకే కాంగ్రెస్ సై కమాండ్ ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి విచారణ కమిటీని రంగంలోకి దించింది. లీగల్ నెట్వర్క్ నుంచి పక్క సాంకేతిక ఆధారాలు సేకరించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా విచారణ జరిపారు.

టిపిసిసి చీఫ్ విఫలం..
కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలను నియంత్రించడంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విఫలం అయ్యారన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. తెలంగాణ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో క్రమశిక్షణ కాపాడటంలో, అంతర్గత కుమ్ములాటలను అదుపు చేయడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని… ఈ కారణంగానే సున్నితమైన సమాచారం లీక్ అయిందని నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో కొందరు వివాదాస్పద నేతలను వెనుకేసుకురావడం, సమన్వయ లోపం వంటి అంశాలపై ఇప్పటికే ఢిల్లీకి నివేదికలు చేరాయి. మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్తో మహేష్ కుమార్ గౌడ్ భారీ రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సిందే నన్న టాక్ వినిపిస్తోంది. ఒక్క మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే కాదు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా పదవి వదులుకోవాల్సి ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు