అమరావతి, క్రైమ్ మిర్రర్: ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే… అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Also Read:Snake Wine: సీసాలో పాము పెట్టి తాగే మద్యం… ఇదేం భయంకర ట్రెండ్?
అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్కు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను.
Also Read: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 2026: ప్రతి చిన్నారి భవిష్యత్తును కాపాడాల్సిన సమయం
అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూన్నాని అన్నారు.