Homeసినిమాఅల్లు అర్జున్ - లోకేష్ కనగరాజు సినిమాలో బిగ్ ట్విస్ట్!

అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజు సినిమాలో బిగ్ ట్విస్ట్!

క్రైమ్ మిర్రర్, సినిమా :- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘AA23’ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. అయితే, ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అసలు హీరోయిన్ పాత్రే ఉండదని టాక్ వినిపిస్తోంది.

కథాపరంగా హీరోయిన్ అవసరం లేదా?
తాజా సమాచారం ప్రకారం, ‘AA23’ సినిమా కథలో హీరోయిన్ పాత్రకు స్కోప్ లేదని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ గత చిత్రాలైన ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాల తరహాలోనే, ఈ చిత్రాన్ని కూడా పూర్తిగా రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారని సమాచారం. ఆ సినిమాల్లో కూడా యాక్షన్‌కే పెద్దపీట వేసి, కమర్షియల్ హంగులకు, రొమాంటిక్ ట్రాక్‌లకు లోకేష్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీ సినిమాను కూడా అదే పంథాలో నడిపించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పూజా హెగ్డే వార్తలకు బ్రేక్?
వాస్తవానికి, ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ‘డీజే’, ‘అల వైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరూ మరోసారి జతకట్టనున్నారని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ, తాజా వార్తలతో ఆ అంచనాలకు బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది.అయితే, ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే, హీరోయిన్ లేకుండా బన్నీ లాంటి స్టార్ హీరో సినిమా రావడం నిజంగా విశేషమే అని చెప్పాలి. మరి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో బన్నీ భాగమవుతాడా లేదా స్వతంత్ర కథతో వస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి.

కరూర్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవు.. విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు షాక్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు