•అధ్యక్షుడిగా తేరా బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వెంకట్ రాంరెడ్డి, ట్రెజరర్‌గా కాయితి చిన్నారెడ్డి ఎన్నిక
•కాలనీ అభివృద్ధే లక్ష్యమని విజేతల హామీ
•భారీ విజయోత్సవ ర్యాలీ, రామాలయంలో ప్రత్యేక పూజలు
•ఆత్మగౌరవ పోరాటానికి కాలనీ వాసుల మద్దతు: విజేతల వ్యాఖ్య
క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్:- హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో తేరా బుచ్చిరెడ్డి ప్యానెల్ భారీ విజయాన్ని నమోదు చేసింది. అధ్యక్షుడిగా తేరా బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వెంకట్ రాంరెడ్డి, ట్రెజరర్‌గా కాయితి చిన్నారెడ్డి విజయం సాధించారు. విజయం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేరా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన విజయానికి సహకరించిన కాలనీ వాసులు, మద్దతుదారులు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలు ధర్మానికి, ఆత్మగౌరవానికి జరిగిన పోరాటమని ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి, ట్రెజరర్ కాయితి చిన్నారెడ్డి పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ విజయానికి వసంత ఆర్కే అపార్ట్‌మెంట్స్‌కు చెందిన సి.హెచ్. మారుతి చేపట్టిన పోల్ మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషించిందని నాయకులు తెలిపారు. అనంతరం విజేతల ప్యానెల్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం శ్రీ రామాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కాలనీ అభివృద్ధి కోసం సంకల్పం చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సొసైటీ డైరెక్టర్ చిట్టిపోలు రాము నేత, మాజీ అధ్యక్షులు తాండ్ర మైపాల్ రెడ్డి, రామిడి వెంకటరమణారెడ్డి, గడ్డం విష్ణువర్ధన్ రెడ్డి, సందీప్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, గుద్దేటి భాస్కర్ నేత, రఘు మారెడ్డి, సత్యశిలా రెడ్డి, వీరారెడ్డి, రాజారెడ్డి, మెగా రెడ్డి తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.