Homeజాతీయంముంబైలో విద్యార్థుల నిరసనకు మద్దతు.. నటి అయేషా ఖాన్ అదుపులోకి! వీడియో వైరల్

ముంబైలో విద్యార్థుల నిరసనకు మద్దతు.. నటి అయేషా ఖాన్ అదుపులోకి! వీడియో వైరల్

ముంబైలో జరుగుతున్న విద్యార్థుల నిరసనకు మద్దతుగా వెళ్లిన నటి అయేషా ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. బుధవారం సాయంత్రం దాదర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్నేహితులతో కలిసి నిరసన ప్రదేశానికి చేరుకున్న అయేషా ఖాన్, తాము అక్కడికి చేరే వరకు ఎలాంటి నినాదాలు చేయలేదని తెలిపింది. అయితే అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే పోలీసులు వచ్చి, అక్కడ నిలబడకూడదని సూచించారని ఆమె పేర్కొంది.

ఈ సందర్భంగా జరిగిన పరిణామాలపై అయేషా ఖాన్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తనతో పాటు ఉన్న సోదరుడు, స్నేహితుడిని కూడా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని ఆమె ఆరోపించింది. అనంతరం పలువురు పోలీసులు కలిసి తమను ఒక వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించినట్లు వివరించింది.

మహిళా సిబ్బంది కూడా తనను బలవంతంగా తీసుకెళ్లారని, తాము ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించామని అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని అయేషా తెలిపింది. దాదర్ నుంచి వర్లీ ప్రాంతానికి తీసుకెళ్లి కొంతసేపు నిర్బంధించినట్లు ఆమె పేర్కొంది.

శాంతియుతంగా నిలబడినందుకు తమపై ఈ చర్యలు తీసుకోవడం బాధాకరమని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అయేషా ఖాన్ అభిప్రాయపడింది. అయినప్పటికీ భవిష్యత్తుపై ఆశతో ముందుకు సాగుతానని ఆమె పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, వివిధ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

also read: “డ్రైవర్ కాదు… సహోద్యోగి!” – ఒక మాటతో మనసులు గెలిచిన యజమాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు