Homeఆంధ్ర ప్రదేశ్జగన్ తో డీకే శివకుమార్ భేటీ!

జగన్ తో డీకే శివకుమార్ భేటీ!

•రాహుల్ గాంధీ ఆదేశాలతో కీలక మంతనాలు
•కాంగ్రెస్ కూటమిలోకి వైయస్సార్ కాంగ్రెస్ అధినేత?!
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో జగన్మోహన్ రెడ్డి భేటీ జరగనుందా? త్వరలో ఆ ఇద్దరు నేతలు సమావేశం కానున్నారా? ఈ మేరకు హై కమాండ్ ఆదేశాలు ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీకానున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం.

మంచి సన్నిహితులు..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు డీకే శివకుమార్. మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి కూడా వారి మధ్య. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వెనుక ఉన్నది డీకే శివకుమార్. అలాగని జగన్మోహన్ రెడ్డితో ఎటువంటి వైరం లేదు. పైగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ. తన సన్నిహితుడి కుమారుడు కావడంతో ఆది నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంది జగన్మోహన్ రెడ్డి విషయంలో డీకే శివకుమార్ కు. అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నివాసం ఏర్పాటు చేసుకోవడం వెనుక డీకే శివకుమార్ ఉన్నారు అనేది ఒక ప్రచారం. జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ తో పాటు బెంగళూరులో నివాసాలు ఉన్నాయి. రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్ అంటేనే జగన్మోహన్ రెడ్డికి గిట్టదు. అటువంటిది బెంగళూరులో జగన్ నివాసం ఏర్పాటు చేసుకోవడం వెనుక డీకే శివకుమార్ ఉన్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో బలమైన ప్రచారం.

రాహుల్ గాంధీ వ్యూహం..
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఎంపిక వెనుక రాహుల్ గాంధీ ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒక్క ఏపీలో తప్ప మిగతా నాలుగు చోట్ల ఆ పార్టీ ప్రభుత్వం నడుపుతోంది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ అండగా నిలుస్తూ వచ్చింది. ఈ క్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మెజారిటీ పార్లమెంట్ సీట్లు దక్కించుకుంటే తప్పకుండా అధికారంలోకి రావచ్చు అనేది రాహుల్ గాంధీ అంచనా. అందుకే ఏపీలో జగన్మోహన్ రెడ్డిని కలుపుకొని వెళ్లాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చర్చించేందుకు డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు