Homeఆంధ్ర ప్రదేశ్పవన్ కీలక నిర్ణయం!

పవన్ కీలక నిర్ణయం!

•నెల్లూరు జిల్లాలో పార్టీ కమిటీలు రద్దు
•మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచనలతోనే?!
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా చాలా జిల్లాల కమిటీలను రద్దుచేసి కొత్త నేతలతో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యవర్గాలను రద్దు చేశారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లా కార్యవర్గాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు మొత్తం.. అన్నింటినీ రద్దు చేశారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన వచ్చింది.

నేతల మధ్య విభేదాలు
జనసేనకు సంబంధించి చాలా జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో నేతలు హై కమాండ్ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని కలుపు కెల్లడం లేదు. కూటమి భాగస్వామ్య పార్టీలతో సంబంధాలు కొనసాగించడం లేదు. దీనికి తోడు చాలామంది తమ సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా జిల్లాల్లో జనసేన నేతలు వ్యవహరిస్తున్న తీరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూరుతోంది. ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్ అటువంటి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో మొత్తం కమిటీలన్నీ రద్దు చేసినట్లు స్పష్టమవుతోంది.

గ్రేటర్ రాయలసీమ పై ఫోకస్..
పవన్ చర్యలు చూస్తుంటే గ్రేటర్ రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అర్థం అవుతోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో జనసేన విస్తరించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సహాయం తీసుకున్నట్లు అర్థం అవుతోంది. పార్టీ స్థానిక సంస్థలకు సంబంధించి జన సైనికుల అభిప్రాయాన్ని తీసుకునే కమిటీలో మాజీ మంత్రి బాలినేనికి చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ప్రకాశం, నెల్లూరు తో పాటు రాయలసీమ జిల్లాల బాధ్యతలను చూస్తున్న కమిటీలో బాలినేని ఒకరు. అయితే ఇప్పుడు ఒక్కో జిల్లా కార్యవర్గాలను రద్దు చేస్తూ పవన్ తీసుకుంటున్న నిర్ణయం వెనుక బాలినేని ఉన్నారు అనేది స్పష్టం అవుతుంది. మున్ముందు బాలినేనికి పార్టీలో క్రియాశీలక బాధ్యతలు కట్టబెట్టేందుకు ఈ మార్పులు చేస్తున్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు